ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లేదని చిన్నారిని పాఠశాల నుండి తీసేసిన సిబ్బంది
చెత్తలో దొరికిన పుస్తకంలో అక్షరాలు దిద్దుతూ చదువుకుంటున్న చిన్నారి
చిన్నారి ఇంట్లో పుట్టడంతో జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది
10 వేలు ఇస్తే పత్రాలు ఇప్పిస్తాం అంటున్న దళారులు
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో ఉండే అశోక్, మమత దంపతుల కూతురు శ్రీవిద్య(8)కు చదువుపై మక్కువ ఎక్కువ
అందరూ పిల్లల్లానే తాను చదువుకోవాలని అనుకుంది.. కానీ శ్రీవిద్యకు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లేదని స్థానిక పాఠశాలలో చేర్చుకోలేదు
తల్లిదండ్రులు శ్రీవిద్యను ఏడాది క్రితం స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించగా, తనకు ఆధారు కార్డు, బర్త్ సర్టిఫికేట్ లేదని యాజమాన్యం పాఠశాల నుండి పంపించారు
బర్త్ సర్టిఫికెట్ కోసం అధికారులను సంప్రదిస్తే.. పాప ఏ తారీఖున పుట్టిందనే వివరాలతో ఆసుపత్రి వారు ఇచ్చిన పత్రం తేవాలంటున్నారని.. పాప ఇంట్లోనే పుడితే ఆ పత్రం ఎలా నుంచి తేవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
రూ.10 వేలు ఇస్తే అన్ని పత్రాలూ సిద్ధం చేస్తామని కొందరు చెబుతున్నారని.. అంత డబ్బు తమ దగ్గర లేదని శ్రీవిద్య తల్లిదండ్రులు వాపోయారు
అధికారులు దయ తలచి ఆ సర్టిఫికెట్లు ఇప్పించి తమ కూతురు చదువుకునేలా చూడాలని వేడుకున్నారు