రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయినా ఎంపీ రవిచంద్ర కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాల్సిందిగా వినతి పత్రం  అందించారు 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు.ఢిల్లీలోని రైల్ భవన్ లో సోమవారం సాయంత్రం వారు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.తమ తెలంగాణలోని రైల్వే ప్రధాన కూడలి ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాల్సిందిగా కోరారు.తమ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమ కాలం నుంచి ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం,ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఈ న్యాయమైన డిమాండ్స్ గురించి కేసీఆర్ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ,సంబంధిత మంత్రులను కలిసి కోరడం,లేఖలు రాయడం జరిగిందని వివరించారు.కోచ్ ఫ్యాక్టరీ 50ఏండ్ల కల అని,ఇది కలగానే మిగిలిపోకుండా ఈ విషయమై తక్షణమే సుస్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా, కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల్సిందిగా రవిచంద్ర,వినయ్ భాస్కర్ లు అశ్వినీ వైష్ణవ్ కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భాలలో కోచ్ ఫ్యాక్టరీని ఖాజీపేటలో కాకుండా పంజాబ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేయడాన్ని వారు రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు.ఇప్పుడు అదే మాదిరిగా కాకుండా ఖాజీపేటలో ఏర్పాటు చేసేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకుని నిధులు విడుదల చేయాల్సిందిగా వద్దిరాజు,దాస్యం తదితరులు రైల్వే మంత్రిని కోరారు.ఖాజీపేటలో నెలకొల్పనున్న ఫ్యాక్టరీలో ఏ తరహా కోచ్ లను తయారు చేయనున్నారో..అవి గూడ్స్, ప్యాసింజర్,వందేభారత్,ఏసీ బోగీలలో ఎటువంటివి తయారు చేస్తారో స్పష్టతనివ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలలో 60శాతం స్థానికులకే ఇవ్వాలని,ఖాజీపేటను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని,చిరు వ్యాపారులకు ప్రత్యేక జోన్స్ కేటాయించాలని, ప్రయాణీకుల సౌకర్యార్థం ఆటో స్టాండ్ ను దూరంగా కాకుండా స్టేషన్ కు సమీపాన ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ రావు,ఎన్.రమేష్,శంకర్, అఫ్జల్,దశరథ్, అశోక్,జీ.శ్రీను,వినయ్ తదితరులతో కలిసి అశ్వినీ వైష్ణవ్ ను శాలువాతో సత్కరించారు, వినతిపత్రాన్ని మంత్రి సావధానంగా చదివి సానుకూలంగా స్పందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment