అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం రాయదుర్గం ఎమ్మెల్యే, విప్ కాలువ శ్రీనివాసులును అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు కోరారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
అగ్రి గోల్డ్ ఏజెంట్లు పడుతున్న బాధలు విన్నవించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రెష్, అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి పాల్గొన్నారు.