10న నులి పురుగుల నివారణ దినం పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 10వ తేదీన నులిపురుగుల నివారణ దినం ను పురస్కరించుకొని వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై వెంకటరమణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల సమన్వయం కోసం జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 2,34,622 మంది ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసే విధంగా అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రణాళికలు రూపొందించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ నులిపురుగుల వలన పిల్లలలో కలిగే దుష్పరిణామాలను, మానసిక ఆరోగ్య సమస్యలను వివరిస్తూ ఆల్బెండజోల్ మాత్రల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖధిపతులు మరియు వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు