ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాజపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అసెంబ్లీ లో ప్రస్తావించారు.
దీంతో రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదన్నారు.
జనాభా, విస్తీర్నం, పరిపాలన సౌలభ్యం ప్రాతిపదికన రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటు జరగలేదన్నారు.
ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేసింది, కానీ రైతుల, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయలేదన్నారు.
రాష్ట్రంలో చాల చోట్ల రెవెన్యూ అనేక భూ సమస్యలు పెరిగాయని, అనేకం అపరిష్కృతంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
అందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూన్నారన్నారు.
కొత్త డివిజన్లతో ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు.
ప్రస్తుతం ఆర్డీవోలను కలిసేందుకు రైతులు, భూమి హక్కుదారులు 50 – 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నారని చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు రెండే రెవిన్యూ డివిజన్లు ఉన్నాయని. , భువనగిరి రెవెన్యూ డివిజన్ పైన అధిక పని భారం పడుతుందన్నారు.
ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది ఆలేరు ప్రజల చిరకాల కోరిక, ఆలేరుని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దాదాపు 8 మండలాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
దానితో పాటు రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని దయచేసి ఈప్రజాప్రభుత్వంలో మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు.
మోటకొండూరు మండలంలో దగ్గర ఉన్న అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా దూరంగా ఉన్న గ్రామాలను కలపడం వల్ల ఇబ్బంది గా ఉందన్నారు.ఇలాంటివి దగ్గర ఉన్న మండలంలో ఏర్పాటు చేయాలని కోరారు…