సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపూర్ మండలానికి 108 అంబులెన్స్ ను కేటాయించాలని కోరారు. నిత్యం ప్రమాదం జరుగుతూ సరైన సమయంలో వైద్యం దొరకక మృతి చెందడం జరుగుతుంది. అలాగే సంస్థాన్ నారాయణపూర్ తండాలలో కనీస బస్సు సౌకర్యాలు లేవు అక్కడున్న గర్భిణీ స్త్రీలకు గాని లేక ఏదైనా ప్రమాదం సరైన రవాణా సౌకర్యం కూడా ఉండదు. చౌటుప్పల్ మండలం మరియు నారాయణపూర్ మండలం ప్రమాదం ఒకేసారి జరిగితే అంబులెన్స్ నారాయణపురం మండలం రావడానికి మూడు గంటల పైగా పడుతుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 213 నూతన 108 అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. అందులో నుండి నారాయణపూర్ మండలానికి ఒక 108 అంబులెన్స్ ని కేటాయించే విధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ తీసుకోవాలని బీసీ యువజన సంఘం నుండి డిమాండ్ చేశారు.
సంస్థాన్ నారాయణపురం మండలానికి 108 అంబులెన్స్ కేటాయించండి…..బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్
Updated On: December 9, 2024 9:39 pm
