అంబేద్కర్ స్పూర్తితో ముందుకు సాగాలి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ముందుకు సాగాలని బీఆర్ఎస్పార్టీ పట్టణ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా సెంటనరీకాలనీ మార్కెట్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్నిచాటి చెప్పారని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు మేదరబోయిన కుమార్ యాదవ్, దామర శ్రీనివాస్,అసం తిరుపతి, బుర్ర శంకర్, గాజుల ప్రసాద్, దర్ముల రాజా సంపత్, మేడగోని రాజన్న, చెలకల జోవహర్, తుమ్మల అశోక్, విఐపి సదానందం, రొడ్డ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.