అమిషాను బర్తరఫ్ చేయాలి: కిచ్చెన్న..

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించటం తగదు

తుక్కుగూడ చౌరస్తాలో బాబా సాహెబ్ విగ్రహం వద్ద నిరసన

భారత రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారిని కీర్తించడం… బీజేపీకి కంటగింపుగా మారిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.

టీ.పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు తుక్కుగూడ మున్సిపాలిటీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేఎల్ఆర్ హాజరయ్యారు.

కాంగ్రెస్, దళిత, బహుజన నాయకులతో కలిసి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు KLR.

ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందేలా రాజ్యాంగం రూపొందించిన మహానీయుడిని అవమానించటం అమిత్ షా అహంకారానికి నిదర్శనం అన్నారు కేఎల్ఆర్.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, దళిత, బహుజన సంఘాలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment