— పదవి నుంచి వెంటనే తప్పుకోవాలి
— వామపక్షనేతల డిమాండ్ దిష్టిబొమ్మదగ్ధం
ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 30 (సమర శంఖమ్) :-
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్లో కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా రాజ్యాంగ ద్రోహి అని వామపక్షనేతలు ఆరోపించారు. ఆయనకు పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సి.పి.ఐ, సి.పి.ఎం., సి.పి.ఎం (ఎం.ఎల్) మాస్ లైన్, సి.పి.ఐ (ఎం.ఎల్) ఎన్డీ ఆధ్వర్యంలో సోమవారం సి.పి.ఐ కార్యాలయం నుండి ప్రదర్శనగా వెళ్ళి బైపాస్ రోడ్ లో అమిత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సబ్బండ వర్గాల అందరికీ హక్కులు, సంక్షేమ అర్హతులు కల్పించారని వారు తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చిన అమిత్ రాజ్యాంగ నిర్మాతనే కించపరిచారని, ఎం.పి.గా, మంత్రిగా ఆయన కొనసాగే నైతిక హక్కులేదన్నారు. బీజేపీ ఈ దేశానికి ప్రమాదకరంగా మారిందని భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలన చేయాలనే ప్రయత్నంలోనే బీజేపీనేతలు రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని వారు తెలిపారు. మతోన్మాధం రెచ్చకొట్టడం ద్వారా రాజకీయ లబ్దిపొందుతున్న బీజేపీ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తుందన్నారు. అమీత్ రాజీనామా చేయక పోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, సి.పి.ఎం. జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వై. విక్రమ్, మాస్లైన్ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఆవుల అశోక్, ఎన్డీ నాయకులు రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రసంగించగా ఈ కార్యక్రమంలో సి.పి.ఐ రాష్ట్ర సమితిసభ్యులు యర్రాబాబు, ఎన్.కె.జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తిగోవిందరావు, జిల్లా కార్యవర్గసభ్యులు శింగునర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, తోట రామాంజనేయులు, నాయకులు పగిడిపల్లి ఏసు, యడ్లపల్లి శంకరయ్య, సి.పి.ఎం నాయకులు మాదినేని రమేష్, యర్రా శ్రీను, నాగేశ్వరరావు, ఎం. ఎల్. నాయకులు, సి.వై.పుల్లయ్య, ఝాన్సీ, శిరోమణి పాల్గొన్నారు.