అనకాపల్లి నూకాంబిక జాతర రాష్ట్ర పండగగా గుర్తించండి: ఎమ్మెల్యే
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ని రాష్ట్ర పండగగా ప్రకటించాలని కోరుతూ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందజేశారు. శాసన సభ సమావేశాలకు హాజరైన కొణతాల పవన్ కళ్యాణ్ ని కలిసి వినతిపత్రం అందజేయడంతో పరిశీలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి నూకాంబిక జాతర విశిష్టతను పవన్ కు వివరించారు.