*హైదరాబాద్ లో జరిగే ప్రపంచ అందాల పోటీలను వ్యతిరేకించండి: POW రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ*
సూర్యాపేట, ఫిబ్రవరి 2, సమర శంఖం ప్రతినిధి :- మహిళల మధ్య విద్వేష పూరిత, మార్కెట్ మాయ జాల అందాల పోటీలను నిర్వహిస్తూ మహిళలను విభజిస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి కార్పోరేట్ శక్తులు, ప్రభుత్వాలు కలసి మహిళలని అన్ని రకాలుగా అణచివేతకు గురి చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారని, హైదరాబాదులో మే 8 న జరిగే ఈ అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడాలని,అడ్డుకుంటామని POW రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభను POW జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా అనసూయ పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం లేదని, రోజు రోజుకు మహిళలపై హింస, దాడులు, అణిచివేత పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వ పాలనలో మూఢత్వ, అంద విశ్వాసాలు, పితృ స్వామిక భావాజాలం బలపడుతుందని, వీటిని పెంచిపోషిస్తున్నారని అన్నారు. మహిళ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న మహిళా కార్యకర్తలపై రాజ్యం ఉపా చట్టాలను ఆపాదిస్తూ ప్రజాస్వామిక హక్కులను కాల రాస్తున్నారని అన్నారు. మహిళలంతా ఐక్యంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 న గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు జరపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యు) జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి రామలింగమ్మ, పులుసు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు జయలక్ష్మి, జయసుధ, ఖాతా లింగమ్మ, సంతోష, సామ ఉపేంద్ర, నాగలక్ష్మి, నవ్య ,మహేశ్వరి, శృతి, పావని తదితరులు పాల్గొన్నారు.*