ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ నుండి 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏడి ఏసీబీకి దొరికాడు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ట్రాన్స్కో ఏడి కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ సంస్థ కాంట్రాక్టర్ నుండి చౌటుప్పల్ ట్రాన్స్కో ఎడి శ్యాంప్రసాద్ 70,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . హైదరాబాదు సరూర్నగర్ లో ఉన్న ఎడి ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఓ పరిశ్రమ కు సోలార్ సిస్టంను అమర్చారు. సోలార్ సిస్టంను అమర్చే కాంట్రాక్టు నిజాంబాద్ కు చెందిన ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ కి అప్పగించారు. సోలార్ పవర్ వాడుకోవడానికి విద్యుత్ మీటర్ అవసరం ఉంటుంది. విద్యుత్ మీటర్ కోసం ఏడి 70 వేల రూపాయల లంచం డిమాండ్ చేసాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుడు ట్రాన్స్కో కార్యాలయంలో 70 వేల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అడ్డంగా దొరికిన మరో అవినీతి తిమింగలం
Published On: March 6, 2025 6:21 pm
