బాపట్ల జిల్లా: జాతీయ రహదారి 216 పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్సై మేడిద సంపూర్ణ రావు దుర్మరణం చెందారు. చీరాలలో నివాసం ఉంటున్న ఏఆర్ ఎస్ఐ టూ వీలర్ పై బాపట్లలో విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న క్రమంలో జాతీయ రహదారిపై ఈపురుపాలెం జంక్షన్ రోడ్ డివైడర్స్ వద్ద ఏపీ 27 ఏవై 4990 షిఫ్ట్ డిజైర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఎస్సై మేడిద సంపూర్ణరావు సంఘటనా స్థలంలోనే మరణించారు. టూ వీలర్ ని ఢీ కొట్టిన షిఫ్ట్ డిజైర్ ఒక పోలీస్ అధికారికి చెందిన వ్యక్తిగత వాహనంగా తెలుస్తోంది. సమాచారం తెలిసిన ఈపురుపాలెం ఎస్సై అంబటి చంద్రశేఖర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. ఎస్ఐ మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన ఈపురుపాలెం పోలీసులు విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ దుర్మరణం
Published On: January 10, 2025 12:21 pm
