మండల పూజ అనంతరం డిసెంబర్ 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచు కోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.