అయ్యప్ప నామస్మరణతో మారుమడిన దేవరకొండ
ఆటపాటలతో హోరేట్టించిన అయ్యప్ప స్వాములు
దేవరకొండ పట్టణంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కన్నుల పండువగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప శరణం.. శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మ రణతో దేవరకొండ ప్రాంత మంతా మారుమోగింది. పట్టణంలోని అయ్యప్ప దేవాలయం వద్ద గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజను శనివారం వైభవంగా నిర్వహించారు.
మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో… శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో .. అయ్యప్ప స్వా మికి పంచామృతాభిషేకం చేసి కనుల పండుగగా అయ్యప్ప మహా పడిపూజను నిర్వహించారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్య ప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు.
గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహా పడిపూజ లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పెటేతులై ఆడారు.అనంతరం అన్న ప్రసాదం వితహరణ జరిగింది
ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యా త్మిక భావననేత్రపర్వంగా ఉండాలి అని అన్నారు