రుణమాఫీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం…రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు  

 — రైతు బరోసా తక్షణం అమలు చేయాలి

— పేదలందరికీ రూ.12వేలు ఇవ్వాలి 

— రైతాంగ ఆందోళనలపై నిర్భందం ఎత్తివేయాలి

— రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు

— తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాపితంగా ధర్నాలు

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 16 (సమర శంఖమ్) :-

రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని రూ.2 లక్షల లోపు రుణాలున్న రైతుల్లో ఎక్కువ మంది మాఫీ జరగలేదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపిచారు. రాష్ట్ర వ్యాపితంగా 50 లక్షల మంది రైతులుంటే అందులో 50 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని రూ.2 లక్షల లోపుఉన్న రైతులలో కూడా వివిధ కారణాలతో మాఫీని నిలుపుదల చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ రైతు సంఘం పిలుపుమేరకు సోమవారం ఖమ్మం జిల్లా వ్యాపితంగా మండలకేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ అర్బన్, రఘునాదం మండల కేంద్రాలవద్ద జరిగిన ఆందోళనలలో పాల్గొన్న హేమంతరావు మాట్లాడుతూ పాస్పుస్తకాలు లేవని, కుటుంబ సభ్యు సంఖ్య సరిపోలేదని రుణమాఫీని నిలుపుదల చేశారని మరణించిన రైతులకు సంబంధించి రుణమాఫీ జరగలేదన్నారు. 4వ దఫా రూ.3 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా రైతుల ఖాతాలలో జమకాలేదన్నారు. రైతు బరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊరిస్తుందని అమలుకు వాయిదాలు పెడుతుందని ఆరోపించారు. సంవత్సర కాలంగా రైతు బరోసా లేదని నవంబర్, డిసెంబర్ అంటూ వాయిదాలు వేసి ఇప్పుడు సంక్రాంతి అంటున్నారని రైతుబరోసాను రైతుల ఖాతాలలో వెంటనే జమచేయాలన్నారు. రైతు బీమా అమలు చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందని హేమంతరావు తెలిపారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నదని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని వారు తెలిపారు. దేశవ్యాపితంగా రైతాంగ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతాంగం పోరాటం బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జీలు చేయడం నిలిపివేయాలని హేమంతరావు డిమాండ్ చేశారు. నూతన సాగు చట్టాలను దొడ్డిదారిన అమలు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని రైతాంగ ఉ ద్యమాలకు సంబంధించి నమోదైన కేసులన్నింటినీ తక్షణం ఎత్తివేయాలని, ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రైతులను తక్షణం ఉపసంహరింపచేయాలని హేమంతరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి అమలు చేయనున్న ఆర్థిక చేయూత పథకాన్ని భూమిలేని ప్రతి పేదవానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ, గ్రామీణ పేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. ఖమ్మం రూరల్, అర్బన్, రఘునాధపాలెం మండల రెవిన్యూ అధికార్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందచేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో సి.పి.ఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ ఛైర్మెన్ మహ్మద్ మౌలానా, రైతు సంఘం నాయకులు మిడికంటి చిన్న వెంకటరెడ్డి, పుచ్చకాయల సుధాకర్, పాసంగుల చందర్రావు, బానోత్ రామ్కోటి, మిడికంటే పెద్ద వెంకటరెడ్డి, మామిడి సుర్శన్రెడ్డి, వెన్నం భాస్కర్, శ్రీనాధరెడ్డి, వెంపటి రాము పాల్గొనగా అర్బన్ కార్యాలయం ముందు ధర్నాలో సి.పి.ఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఎస్.కె. జానిమియా, మహ్మద్నలాం, పగడాల మల్లేష్, మేకలశ్రీనివాసరావు, నాయకులు యానాలి సాంబశివరెడ్డి, నూనెశశిధర్, ఎస్.కె. సైదా, పోటుపూర్ణచందర్రావు, జ్వాలా నర్సింహారావు, ప్రతానపు రామనాధం తదితరులు పాల్గొన్నారు. రఘునాధపాలెం మండల కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో సి.పి.ఐ మండల కార్యదర్శి శాకమూరిశ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు బాగం ప్రసాద్, బానోత్ చీనా, బానోత్ రవి, సురభిశ్రీను తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment