బ్యాంక్ చిన్న తప్పిదం విలువ రూ.52,314 కోట్లు

బ్యాంక్ చిన్న తప్పిదం విలువ రూ.52,314 కోట్లు

బ్యాంకు ఉద్యోగులు చేసే చిన్న చిన్న తప్పిదాలతో ఒకరి ఖాతాలో జమవ్వాల్సిన నగదు మరొకరి ఖాతాకు క్రెడిట్ అవ్వడం లేదా పెద్ద మొత్తంలో అకౌంట్‌లో నగదు జమకావడం అప్పుడప్పుడు జరుగుతుంది.

తాజాగా, అమెరికా ఇన్వె‌స్టిమెంట్‌ దిగ్గజం సిటీ బ్యాంకులో కూడా ఇలాంటి పొరపాటే జరిగింది. అయితే, ఒకటి రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 52,314 కోట్లకుపైగా నగదు మరో ఖాతాలోకి వచ్చి చేరింది. గతేడాది ఏప్రిల్‌లో సిటీ గ్రూపు ఉద్యోగి ఓ కస్టమర్‌ ఖాతాలోకి నగదు జమ చేయబోయి.. పొరపాటున మరో అకౌంటర్ నెంబర్ కాపీ పేస్ట్ చేశాడు. అమౌంట్ స్థానంలో అకౌంట్ నెంబరు పడింది. లావాదేవీలు పర్యవేక్షించే ఉన్నత స్థాయి అధికారి కూడా ఈ పొరపాటును గమనించకుండా క్లియరెన్స్ ఇచ్చాడు.

దాంతో సంబంధిత కస్టమర్‌ ఖాతాలోకి 6 బిలియన్ డాలర్లు (అంటే రూ. 52,314 కోట్లు) అందులో జమయ్యాయి. జరిగిన ఈ పొరపాటును ఆ మర్నాడు గుర్తించిన సిబ్బంది.. ఆ లావాదేవీని రివర్స్‌ చేసి నగదును వెనక్కు తీసుకున్నారు.

దీనిపై ఓ ప్రకటన చేసిన సిటీ గ్రూప్.. ‘పొరపాటును వెంటనే గుర్తించి సిబ్బంది సరిచేశారు., ఇది బ్యాంకు లేదా మా క్లయింట్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదు… మాన్యువల్ విధానం తొలగించి, రెగ్యులేటరీలను ఆటోమేట్ చేయడానికి సిటీ గ్రూప్ నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అనుగుణంగా మెరుగైన చర్యలను మేం అమలు చేశాం’ అని తెలిపింది.

కాగా, ఇటువంటి పొరపాట్లు జరిగినప్పుడు ఎలా పరిష్కరించాలో ఉన్నతాధికారులు, నియంత్రణ సంస్థలతో ఎగ్జిక్యూటివ్‌లు చర్చిస్తుంటారు. అసాధారణ చెల్లింపులు, బదిలీలను పరిశీలించడంలో సహాకరించేందుకు ఓ వ్యవస్థను సిటీ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ సిటీ గ్రూప్‌లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

2020లో అంతర్జాతీయ సౌందర్య సాధనాలు ఉత్పత్తి సంస్థ రెవలాన్ ఖాతాలో పొరపాటున 900 మిలియన్ డాలర్లను బ్యాంకు సిబ్బంది జమచేశారు. వీటిని వెనక్కి తీసుకోవడానికి సిటీ గ్రూప్ చాలా శ్రమించాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన అనంతరం.. ఆ ఖాతా నుంచి నగదు వెనక్కి తీసుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment