బత్తుల శ్రీశైలంకి ఘనంగా సన్మానం
చౌటుప్పల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ ని భవానీ యూత్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు. పూలమాలవేసి శాలువా కప్పారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులను వైస్ చైర్మన్ గౌడ్ దగ్గరుండి పనులు చేయించారని అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ ఆయనను గెలిపించి మున్సిపల్ చైర్మన్ ని చేస్తామని అన్నారు. అనంతరం మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నేను చౌటుప్పల్ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నమోని గోవిందు, అన్నమోని పాండు, రాములు, సురేష్, శివాజీ, రాకేష్, సంతోష్, శివ, మురళి, గడ్డం రఘుపతి, గఫర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.