ఏపీలో ‘వందే భారత్’ డిపో రెడీ!
విజయవాడ :
దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ కావటం తో ఇక్కడ వందేభారత్ రైళ్లకు మెయింటెనెన్స్ స్టేషన్ అవసరమన్న ఉద్దేశ్యంతో రైల్వేబోర్డు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో మిల్క్ ఫ్యాక్టరీ ఎగువన ఫ్లై ఓవర్కు సమీపంలో రైల్వే యార్డుకు దగ్గరగా దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందేభారత్ రైళ్లకు సరిపడా అతిపెద్ద డిపోను ఏర్పాటు చేశారు.