ఆంధ్రప్రదేశ్ కి భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశలవారీగా రూ.95వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటికే మూడు రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. రూ.6,100కోట్ల అంచనావ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment