ఘనంగా చలమల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా చలమల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మండలం దామర గ్రామం ఆయన పార్టీ కార్యాలయంలో చలమల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చౌటుప్పల్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నవారికి పండ్ల పంపిణీ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి అభిమానులు దామర గ్రామంలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో పలువురు రక్తదానం చేశారు.

అభిమానులతో కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాపై ఉన్న అభిమానుల అండదండలతో ముందుకు సాగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, చలమల నరసింహారెడ్డి, గూడూరు వెంకటరెడ్డి, నరసింహ గౌడ్, నాగరాజు, సత్యనారాయణ, అలాగే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment