అంబేద్కర్ ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ ట్రస్ట్ చైర్మన్ బోయ రామ్ చందర్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమావేశ మందిరం లో ఏమ్మార్పిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో అవమానాలు, అసమానతలు, అంటరాని తనం ఎదుర్కొని, తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్న త చదువులు చదివి భారత రాజ్యాంగం రాసి భారత దేశంలో ని దళితుల కు, బడుగు బలహీన వర్గాల కు, మహిళలకు స్వేచ్ఛ, హక్కులు సాధించి పెట్టిన మహోన్నత మైన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు ఊదరి వెంకటేష్ మహాజన్, నాయకులు చింతల సాయిలు, మాజీ ఎంపీటీసి బోయ ఇందిర సంజీవ, ఊదరి నర్సింహా, ఎర్రశంకర్, కట్టెల లింగస్వామి, ఆరుట్ల లింగస్వామి, బర్రె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.