లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి సంకెళ్లు వేయటం సిగ్గుచేటు అంటూ నినాదాలు. — బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై నిరసన తెలిపిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 17 (సమర శంఖమ్) :-

రైతన్నలపై కక్ష సాధింపులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మారాలంటూ.అన్యాయమవుతున్న గిరిజన రైతులకు న్యాయం జరగాలంటూ.జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరియు ముఖ్య నాయకులు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు గారు మాట్లాడుతూ రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న మొండివైఖరిని తీవ్రంగా ఖండిస్తూ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రైతులపై కక్ష వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గిరిజన రైతుల పక్షాన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం

లో కార్పొరేటర్లు దాదే అమృత, మక్బుల్, పల్లా రోస్ లీనా ,దండా జ్యోతి అయ్యప్ప రెడ్డి, బుర్రి వెంకట్,మాటేటి నాగేశ్వరావు ,కన్నం ప్రసన్న, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, తెలంగాణ ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరు నాయక్, గుత్తా రవి బిచ్చల,తిరుమలరావు, డోకుపర్తి సుబ్బారావు, మేకల సుగుణ రావు,మహిళా నాయకురాలు కొల్లు పద్మ, పల్లా రాజశేఖర్ ,పగడాల నరేందర్ ,ST సెల్ నగర అధ్యక్షుడు సురేష్ ,మాజీ కౌన్సిలర్ వంగాల వెంకట్ ,మైనారిటీ నగర అధ్యక్షుడు శంషుద్దీన్, షకీన,పార్టీ నాయకులు చేతి క్రిష్ణ, దానయ్య , అబ్బాస్, బులుసు మురళీకృష్ణ, బోజెడ్ల రాంమోహన్ ,నిరోష,పార ఉదయ్ ,కిషన్ నాయక్ ,వీరేందర్, సద్దాం షేక్, బురాన్ ,ఉస్మాన్, నెమలి కిషోర్, ఆరెంపుల వీరభద్రం , మలుసూర్ ,నారమళ్ళ వెంకన్న ,పాషా, ఫ్రాన్సిస్, వెంకట్,సూత్రాల శ్రీను ,దరిపెల్లి శ్రీను,,ఉదయ్,లింగరాజు ,కిట్టు ,కోటి ,తిరుమల్ ,వెంకట్ ,సైదా హుస్సేన్ ,కుమ్మరి వెంకటేశ్వర్లు ,ఇమాస ,నగేష్ ,శైలేజా,మాదవి ,ఆస్మా ,నాగరాజు ,అనీల్,షెరీఫ్,ఫక్రుద్దీన్,నాగరాజు,ఖాదర్,చింతపల్లి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment