భారాస నేతలు కేటీఆర్, హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు.పాడి కౌశిక్‌రెడ్డిని సోమవారం కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Published On: January 14, 2025 12:47 pm
