ఉత్సాహంగా సి ఏం కప్ పోటీలు…

---Advertisement---

మెదక్ బ్యూరో/ సమర శంఖమ్ :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సి ఏం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలలో నాలుగవ రోజు బాలురు మరియు బాలికల విభాగం లో అథ్లెటిక్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. రెండు క్రీడలలో కలిపి మొత్తం 400 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. పోటీల ముగింపు సమావేశానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సి.ఏం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలలో నాలుగవ రోజు క్రీడల పోటీలు మెదక్ అవుట్డోర్ స్టేడియం మరియు పి.ఎన్.ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించామని అన్నారు. అథ్లెటిక్స్ లో 23 మంది బాలురు 23 మంది బాలికలు మొత్తం 46 మంది అలాగే షటిల్ బ్యాడ్మింటన్ నందు 8 మంది బాలురు 8 మంది బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.గెలుపొందిన క్రీడాకారులు ఇదే నెల 27వ తేదీ నుండి హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రేపు అనగా తేదీ 20-12-24న మెదక్ స్టేడియంలో పురుషులకు మరియు మహిళలకు చెస్ మరియు యోగ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమం లో అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మధు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి మధు మరియు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు పీ.డీలు శ్యామయ్య, రాజేందర్, వినోద్, మరియు వివిధ మండలాల నుండి విచ్చేసిన వ్యాయామ ఉపాద్యాయులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment