ఇక రెండుసార్లు CBSE బోర్డు పరీక్షలు..!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు పర్యాయాలు CBSE బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 24న CBSE ముసాయిదా విడుదల చేయనుంది. JEE మెయిన్స్ తరహాలో విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. వీటిలో సాధించే ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించనున్నారు. 2026 ఫిబ్రవరిలో ఒకసారి, మార్చిలో మరోసారి పరీక్షలు నిర్వహించేఅవకాశం ఉంది..!!