సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలంటూ.. చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలంటూ.. చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల వాగ్దానంను తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు న్యాలట అశోక్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయాలని కోరుతూ మండల పరిధిలోని మడికట్టు గ్రామంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు.

రైతు బంధు, రైతుకు గిట్టుబాటు ధర, విద్యార్థి యువకులకు నిరుద్యోగ సమస్య, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, పింఛన్ పెరుగుదల అనేక విషయాలను బుట్టదాకలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లోటు బడ్జెట్‌ను చూపిస్తూ కాలయాపన చేస్తుందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో రోజురోజుకు దేశం, రాష్ట్రంలో ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు, అత్యాచారాల పరంపర కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి అలింగ శిష్యుల్లాగా పనిచేస్తున్నాయి తప్ప పేదల పక్షపాతిగా ప్రభుత్వాల తీరు ఉండకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను సత్వరమే అమలు చేయాలని చెప్పి, ఈనెల 20న హైదరాబాద్ లో జరిగే చలో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు బల్ రెడ్డి, కృష్ణ గౌడ్, సురేష్, న్యాలట గణేష్, సిద్దార్థ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, జనార్దన్, చెంద్రయ్య, శ్రీనివాస్, జంగయ్య, రాఘవేందర్, రామయ్య, రఘపతి రెడ్డి, రామయ్య, శేఖర్, దశరథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment