ఉండవల్లిలో ఓటు వేయనున్న చంద్రబాబు, లోకేశ్
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదె రామయ్య, సీతారావమ్మ ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో నివసిస్తున్న వీరిద్దరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకున్నారు.