మామిడి ఆకులతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు

మామిడి ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులలో విటమిన్ సి, బి, ఎ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి ఆకులతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. చికాకు, దద్దుర్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తనాళాలు బలపడతాయి. రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. ర‌క్త‌నాళాలను ఆరోగ్యంగా మారుస్తాయి. దీంతో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ మామిడి ఆకులు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. ఈ ఆకుల‌తో త‌యారు చేసిన నీళ్ల‌ను తాగితే లిపిడ్ మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. దీంతో కొవ్వులు సుల‌భంగా క‌రిగిపోతాయి. దీని వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. మామిడి ఆకుల టీ అనేది నాచుర‌ల్ మెడిసిన్ మాదిరిగా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం క‌రిగిపోతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment