రాజకీయాలు నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. by Samara Shankam Desk Published On: December 7, 2024 2:53 pm నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రోడ్ల విస్తరణకు 204 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం… 5 రహదారుల పనులను మంజూరు చేస్తూ తాజాగా జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్ట వరకు ఘాట్ రోడ్ నిర్మాణం…బ్రహ్మంగారి మఠం శివాలయం రోడ్డు నిర్మాణానికి 140 కోట్లు మంజూరు. అనిశెట్టి దుప్పలపల్లి నుండి ఖాజీరామారం వయా కనకాల పల్లి, నల్గొండ -నకిరేకల్ పిడబ్ల్యుడి పజ్జూరు రోడ్డు విస్తరణకు 20 కోట్ల రూపాయలు మంజూరు. సాగర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి కనగల్ రోడ్డు వయా తిమ్మన్న గూడెం రోడ్డుపనుల విస్తరణ,పటిష్ఠతకు14 కోట్ల రూపాయలు మంజూరు. 16 కోట్ల రూపాయలతో చర్లపల్లి నామ్ రోడ్డు నుండి పిట్లంపల్లి వరకు రహదారి విస్తరణ, నార్కట్ పల్లి నుండి మాండ్ర రహదారి విస్తరణ పటిష్టత పనుల కోసం 14 కోట్ల రూపాయలు మంజూరు. Post Views: 35 Cm revanth Green signal Nalgonda Narkatpally Road