సంవత్సరం క్రితం డిసెంబర్ 7,2023న హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది
చరిత్రలో 2 జూన్,2014 కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7,2023కు, డిసెంబర్ 7, 2024 కు అంతే ప్రాధాన్యత ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ మహమ్మారితో బాధ పడిన నల్గొండ జిల్లా, స్వరాష్ట్రంలో కూడా విముక్తి కల్గలేదు
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందు వరుసలో ఉంది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు
మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసింది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమర వీరుడు శ్రీకాంత్ చారి ది నల్గొండ జిల్లా
నిజాంలను తరిమికొట్టిన సాయుద రంగ రైతు పోరాటానికి నల్గొండ జిల్లా నాయకత్వం వహించింది
సాయుధ పోరాటం నుంచి ఎర్రజెండాల పోరాటం వరకు నల్గొండ ముందు ఉంది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నల్గొండ జిల్లా బాగు పడుతుందని ఆశించాం
ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం కోసం ఎస్.ఎల్.బీ.సి , ఉదయ సముద్రం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
44 కిమి సొరంగ పనులను ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వేగవంతంగా పూర్తి చేస్తాం
3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 పైగా గ్రామాలకు త్రాగు నీరు అందించే ఎస్.ఎల్.బీ.సి, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే ఉదయ సముద్రం ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో మంజూరు చేశారు
ఆనాడు కేసిఆర్ సొరంగ పనులను, ఉదయ సముద్రం ప్రాజెక్టు లను నిర్లక్ష్యం చేశారు
ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండ జిల్లాకు అధికంగా అన్యాయం జరిగింది
దక్షిణ భారతదేశంలో అత్యధిక మెజారిటీ నల్గొండ ఎంపీకు అందించారు
సాగు నీటి పారుదల శాఖ మంత్రి గా నల్గొండ జిల్లా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అప్పగించాం
చిన్న ప్రాజెక్టు నుంచి పెద్ద ప్రాజెక్టు వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు నిధులు గ్రీన్ చానెల్ లో విడుదల చేస్తాం
ఎస్.ఎల్.బీ.సీ, ఉదయ సముద్రం, పిలై కాలువ, ధర్మా రెడ్డి కాల్వ మొదలగు పనులు వేగవంతంగా పూర్తి చేడి కృష్ణ జలాలను తరలించి దేశానికే ఆదర్శంగా నిలబెడుతాం
గతంలో వరి వేస్తే ఉరి అనే మాట కేసిఆర్ చెప్పారు
నేడు 8500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేస్తున్నాం
దేశంలో అత్యధికంగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది
నల్గొండ రైతాంగం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది
ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ కు వచ్చి ప్రశ్నించాలి, గతంలో జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ప్రతి పక్ష నాయకుడిగా పని చేశారు
కేసిఆర్ అసెంబ్లీ కు రావాలి, వారి అనుభవాలను తెలంగాణ ప్రజల కోసం వినియోగించాలి
గతంలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా ప్రజా క్షేత్రం వదిలి పెట్టకుండా మేం పోరాటం చేశాం
ఫ్యాక్టరీ, పరిశ్రమలు, ఆర్.ఆర్.ఆర్, ఫ్యూచర్ సిటి, మెడికల్ కాలేజీ, ఫాక్స్ కాన్ కంపెనీ వంటి ప్రతి అంశానికి ప్రతి పక్ష నాయకులు అడ్డు పడుతున్నారు
పరీక్షలు పెట్టవద్దు ఉద్యోగాలు ఇవ్వ వద్దు అనే రీతిలో ఉంటే ఎలా?
1200 అమరుల త్యాగం కారాదు
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేసింది తామే.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటీ సంవత్సరంలో 55 వేల 143 ఉద్యోగాలు ఇచ్చింది తమ ప్రభుత్వం
గత 26 సంవత్సరాలో గుజరాత్ , యూపి, మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఎక్కడైనా 55 వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చారా?
25 లక్షల 50 వేల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రం
నల్గొండ జిల్లాలో 2 వేల 4 కోట్లు రుణమాఫీ జరిగింది
నేడు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం
500 రూపాయలకే సబ్సిడీ పై గ్యాస్ సిలిండర్ సరఫరా
కార్పోరేట్ ఆసుపత్రులలో 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్య
పేద విద్యార్థుల కోసం 40 శాతం డైట్ చార్జిలు పెంచాం
21 వేల పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, 30 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం
హోమ్ గార్డు, పోలీస్ ఆత్మ గౌరవం పెంచి, వారి సమస్యల్ని పరిష్కరించాం
వ్యవసాయ రంగానికి మొదటి సంవత్సరం 54 వేల కోట్ల అందించాం
గతంలో కేసిఆర్ చేసిన అప్పులకు మనం 65 వేల కోట్ల మిత్తి, అసలు చెల్లించాం
సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి
సన్న వడ్లే రైతులు పండించాలి, బోనస్ 500 చెల్లించి కొనుగోలు చేస్తాం
రేషన్ లో సన్న బియ్యం సరఫరా చేస్తాం
ఆనాడు వైఎస్సార్ చేతుల మీదుగా రింగ్ రోడ్డు, నేడు వెంకన్న చేతుల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు
50 వేల ఎకరాల్లో కొత్త సిటీ నిర్మించి నిరుద్యోగ సమస్య పరిష్కరించేలా అంతర్జాతీయ కంపెనీలను తీసుకొని వస్తాం
నల్గొండ ప్రజల కష్టాలు చూసి మూసి నది ప్రక్షాళన చేస్తాం
మూసి ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండ లో ఎవరు బ్రతుకలేరు
మూసి ప్రాజెక్టు కట్టి నల్గొండ జిల్లాకు పరిశ్రమల వ్యర్థాల నుంచి విముక్తి కల్పిస్తాం
అభివృద్ధి కావాలంటే ఎవరొ ఒక్కరూ కొంత భూమి కొల్పోవాలి