ఖమ్మం జిల్లా యాదవుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి చిత్తారు శ్రీహరి యాదవ్

చిత్తారు శ్రీహరి యాదవ్ 13వ వర్ధంతి కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య్ చిత్తారుశ్రీహరి యాదవ్ సేవలు మరువలేనివని, వారు లేని లోటు ఇప్పటికీ అలాగే మిగిలి ఉందని, వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని, వారు చేసిన సేవలకు గుర్తింపుగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్మించిన ఖమ్మంలో ఉన్న గోకుల కృష్ణ సేవా సమితి భవనానికి చిత్తారు శ్రీహరి యాదవ్ స్మారక భవనంగా నామకరణం చేయాలని, గతంలో కొంతమంది వ్యక్తులు అడ్డుకోవడం వలన నామకరణం చేయలేకపోయామని, నామకరణం చేయాల్సిన అవసరం ఉందని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకులు దివంగత కీర్తిశేషులు చిత్తారు శ్రీహరి యాదవ్ 13వ వర్ధంతి కార్యక్రమం వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో ఘనంగా జరిగింది.

అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ తదితర యాదవ ప్రముఖులు చిత్తారు శ్రీహరి యాదవ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప మహానాయకుడు, వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని, యాదవులంతా ఏకమైతే మనకు రాని పదవి అంటూ ఉండదని, మన యాదవుల కోసం ఏదో ఒకటి చేయాలని ప్రతిసారి, ప్రతి సందర్భంలో శ్రీహరి అనేవాడని వక్తలు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెల్లబోయిన రమణ, బమ్మిడి శ్రీనివాస్, లింగరాజు యాదవ్, రాచబంటి వంశీ, దుద్దుకూరి చందర్రావు, చిత్తారు నాగరాజు, వాకదాని కోటేశ్వరరావు చిత్తారు పుల్లయ్య యాదవ్, చెప్తారు మల్లేశం బొమ్మ వెంకటేశ్వర్లు, చిత్తారు కృష్ణయ్య చిత్తారు నాగేశ్వరరావు, గుమ్మ కృష్ణమోహన్ వీరభద్రం, కన్నె పైన రవి యాదవ్ మేడిదల మల్లేశం, మొరి మేకల కోటయ్య నన్నెబోయిన పద్మ, బండారు ప్రభాకర్, చిత్తారు గోవిందు, చిర్ర సూర్యనారాయణ, కంచర్ల నాగేశ్వరరావుమరియు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment