కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సిఎం చంద్రబాబు
ఢిల్లీ, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీకి ఆర్థికంగా మరిన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై నిర్మలా సీతారామన్‌తో సీఎం, ఆర్థిక మంత్రి చర్చలు జరిపారు. ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను ఆమెకు వివరించారు.
క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ నిధుల కోసం ప్రత్యేకంగా వీజీఎఫ్ స్కీం ప్రవేశపెట్టడంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం ఉందన్న చర్చల్లో భాగంగా నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
వీజీఎఫ్ స్కీంలో భాగంగా కార్పస్ ఫండ్ నిమిత్తం రూ. 2 వేల కోట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు అందించిన సాయంపై నిర్మలా సీతారామన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.