హైదరాబాద్, డిసెంబర్ 30 సమర శంఖమ్ :-
ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. “మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోంది. ఆయన తెలంగాణకు ఆత్మబంధువు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన నాయకుడు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్ చేయించిన సారథి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తాం” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.