నగరంలో నాయి బ్రాహ్మణుల ఆందోళన

నగరంలో నాయి బ్రాహ్మణుల ఆందోళన

గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణులు పోచం మైదాన్ 80 ft రోడ్ లో ఇతర సామాజిక వర్గానికి (మైనార్టీ) చెందిన వ్యక్తులు సెలూన్ షాపు నిర్వాహనకై ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుసుకున్న నగర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కస్తూరి సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నగర నాయి బ్రాహ్మణులు ఆందోళన చేశారు, మా జీవనోపాధి అయిన మా కులవృత్తిని ఇతర సామాజిక వర్గానికి చెందినవారు చేయవద్దని హెచ్చరించి,ఆ షాపు యొక్క యజమానిని మరియు షాపు నిర్వహించే నిర్వాహకుడు సాబీర్ చేత అందరి సమక్షంలో షాపు నిలిపి వేస్తున్నాను అని ప్రమాణం చేపించడం జరిగింది, ఈ షెటర్ నందు నేను సెలూన్ షాపు కు సంబంధించిన ఏ విధమైన షాపును నిర్వహించనని నాయి బ్రాహ్మణులందరిసమక్షంలో మరియు షాపు ఓనర్ ముందు సాబీర్ మాట ఇస్తూ ప్రమాణం చేయడంతో ఆందోళన విరమించారు,ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కస్తూరి సతీష్ మాట్లాడుతూ మా యొక్క కులవృత్తిని నమ్ముకుని నిరుపేద వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి మా యొక్క పొట్ట కొట్ట వద్దని విజ్ఞప్తి చేస్తూ. మా నాయి బ్రాహ్మణుల కులవృత్తులకు ఇతర కులస్తులు రావద్దని హెచ్చరించినారు.. ఈ కార్యక్రమం లో జిల్లా నాయి బ్రాహ్మణ కమిటీ సభ్యులు రాజేందర్ దశరథం సతీష్ కుమార్ మధుసూదన్ సందేటి వేణు నాగరాజు కర్ణాకర్ కృష్ణ సదానందం రాజేష్ యుగేందర్ కన్నయ్య ఉపేందర్ రమేష్ రాజు కిరణ్ రవీందర్ సహదేవుడు మహేష్ రవి చందర్ శ్రీకాంత్ నవీన్ బిక్షపతి వెంకట్ పూర్ణచందర్ వెంకటయ్య యాదగిరి వెంకట్ దామోదర్ సాంబమూర్తి శ్రవణ్ సురేందర్ భాస్కర ప్రశాంత్ నవీన్ జెట్టిసాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment