తునికాకు సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్

తునికాకు సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆదివాసి యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. 2024 డిసెంబర్ నెలలోనే తునికి ఆకు టెండర్లను పూర్తి చేసి ఫ్రూనింగ్ (కొమ్మ కొట్టుడు) పనులను కూడా పూర్తి చేయాలి, కానీ 2025 మార్చి నెల వచ్చినా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదని, ఫ్రూనింగ్ జరగలేదని, ఆకు సేకరణ కనీస స్థాయికి తగ్గుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసీల సాంప్రదాయ ఆదాయంపై ప్రభుత్వం వేటు వేసే దురుద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతుందని, అందుకేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను అత్యధిక మెజార్టీతో ఆదివాసులు గెలిపించిందని, తునికి ఆకు సేకరణ వేసవిలో పెట్టకపొతే పంట ఆదాయం ఆకు తెంపుట నుండి బీడీలు చుట్టూ వరకు లక్షల మంది మహిళలు ఉపాధి కోల్పోతారని, యంత్రాలు లేని పరిశ్రమ అన్నం పెట్టే వేసవి అవసరాలను తీర్చుతుందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలపై పోడు దాడులు చేసిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆదివాసీల ఆదాయ వనరులపై వేటు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తునికాకు సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదని సంబంధిత ప్రభుత్వ ప్రతినిధులకు వ్యక్తిగత సెటిల్మెంట్ల ఫైనల్ కాకపోవడం వలన టెండర్లు ఖరారు కావడం లేదని ఆరోపించారు.

ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో టెండర్లు పూర్తి అయ్యాయని, ఆకు సేకరణకు సిద్ధమవుతున్నారని, ఆయా రాష్ట్రాల్లో 50 ఆకు కట్ట సేకరణకు 4 నుండి 5 రూపాయల వరకు ఉన్నదని, కూలీ డబ్బులను బ్యాంకుల్లో జమ చేయడం వలన, ఆకు సేకరణకు కూలీలు ఉత్సాహం చూపడం లేదని, ఈ డబ్బులను అప్పుల కింద బ్యాంకులు మినయించుకోకుండా ప్రభుత్వం తగిన నిబంధనలతో మినహాయింపు ఇవ్వాలని బోనస్ డబ్బులు సాకాలంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

బకాయిలు చెల్లింపులను పూర్తి చేసి, అవకతవకలకు పాల్పడిన ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల్లో జమ చేసిన బోనస్ డబ్బులతో సంబంధిత శాఖ వారు ప్రైవేటుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా బోనస్ డబ్బులను ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నదని, ఇప్పుడు పద్ధతులను నివారించి స్వార్థపరులను కట్టివేయాలని, టెండర్లు ఖరారు కానీ ఎడల ప్రభుత్వమే ఆకును సేకరించి కూలీలకు ఉపాధి కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీతో పాటు ఇతర విప్లవ సంస్థలను కలుపుకొని ప్రజలను భాగస్వామ్యంగా చేసి నిర్వహించిన పోరాటాల వల్లనే ఆకు సేకరణకు రేటలను పెంచుకున్నామని తెలియజేశారు.

ఈ పారిశ్రామిక ఉనికిని కోల్పోకుండా మనుగడను కోనసాగిస్తుందని, పాలకుల సరికొత్త కుట్రలను అటవీ ప్రాంతా యువతి యువకులు తిప్పికొట్టాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు. అధికంగా ఆకులను సేకరించుకొని కట్టకు 5 రూపాయలను ఇవ్వాలని, కూలిరేట్లు సాధించుటకు జరిగే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

ప్రభుత్వం బాధ్యతలను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అధిక ఆకు సేకరణపై దృష్టి పెట్టాలని, 2025 సీజన్ రేటును 5 రూపాయలకు పెంచాలని, ఇతర పనులకు 25% అదనంగా రేట్లు పెంచి ఇవ్వాలని, తెలంగాణలో బకాయి పడ్డ కోట్లాది రూపాయలు తునికాకు బోనస్ను వెంటనే చెల్లించాలని, ఆకు సేకరణ సమయంలో ప్రమాదాలకు గురయ్యే కూలీలకు తగిన నష్టపరిహారం చెల్లించి, ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తరపున డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు ఇరుప రాజేష్, రమేష్, రాజు, ప్రణయ్, చలపతి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment