రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన – కాంగ్రెస్ నాయకులు

సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి లింగస్వామి ముఖ్యఅతిథిగా హాజరై డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప్పల లింగస్వామి మాట్లాడుతూ డబ్బు, అధికారం ,కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో అంబెడ్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి.రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. పార్టీలు పేద ,బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తున్న నేపథ్యంలో రాజనీతి దార్శనికుడు,బడుగుల ఆశాజ్యోతి, బహుజనుల దేవుడు బాబాసాహేబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ,ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి వ్యక్తి ఇంట్లో పెట్టుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్, నోముల మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, రహీం షరీఫ్, బెల్లంకొండ శంకరయ్య, ఎర్రోళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment