పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 18 సమర శంఖమ్
కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ ను నిన్న రాజ్యసభలో అవమానిస్తూ , వ్యంగ్య వ్యాఖ్యలచేసిన దానికి నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు అంబేద్కర్ చిత్రపటాలు ప్రదర్శిస్తూ పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేపట్టారు. అమిత్ షా అంబేద్కర్ పై మరియు రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. బిజెపి , ఆర్ఎస్ఎస్ లకు రాజ్యాంగం పై నమ్మకం లేదు..గౌరవం కూడా లేదా అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పెద్దలు చరిత్రను మార్చే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. బీజేపీ కి గత పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేవారని రాజ్యాంగాన్ని , రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరచడం సిగ్గుమాలిన చర్య అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.