గడపగడపకు కాంగ్రెస్ పథకాలను తీసుకువెళ్లాలి: బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

గడపగడపకు కాంగ్రెస్ పథకాలను తీసుకువెళ్లాలి: బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను అన్ని గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీసుకువెళ్లాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మండల కేంద్రం ఎనగంటి తండా గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఆదేశాల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎనగంటి తండా స్థానిక ఎన్నికల ఇన్చార్జీలు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ… గ్రామంలో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారానికి సంబంధించిన వివిధ అంశాల పై పార్టీ నాయకులతో చర్చించారు. అనంతరం బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నందువల్ల కార్యకర్తలు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పలు సూచనలను, మార్గదర్శకాలను తెలిపారు. జడ్పిటిసి, ఎంపిటిసి,సర్పంచి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కరెంటోతు రాజు నాయక్, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇప్ప వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ లచ్చు నాయక్, శంకర్ నాయక్, నీలు నాయక్, హము నాయక్ నాను నాయక్ రఘు నాయక్ గుణామ సక్కు నాయక్, రాము నాయక్,గ్రామ ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.,

Join WhatsApp

Join Now

Leave a Comment