జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు వేలాదిమంది విద్యార్థులతో మరో ఉద్యమం చేపట్టకతప్పదని హెచ్చరించారు.పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్,స్కాలరుషిప్ బకాయిలు 5000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఫీజు బకాయిలు చెల్లించకుండా ఎత్తివేసే కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ప్రభుత్వ,గురుకుల, కస్తూర్బా సంక్షేమ హాస్టళ్లలో 1200 మంది విద్యార్థులు కల్తీ భోజనం తిని అస్వస్థతకు గురయ్యారని,అందులో సుమారు 40 మంది విద్యార్థులు చనిపోయిన ప్రభుత్వం సరియైన చర్యలు చేపట్టకపోవడం శోచనీయం అన్నారు.విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్,ఎస్.దయాకర్,ప్రవీణ్,నిరంజన్,యోగేష్,సచిన్,బాలరాజ్,రాజేందర్,శ్రీధర్,మోహన్,రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తేసే కుట్ర
Published On: December 6, 2024 12:09 pm
