– త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులది
– CPI జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
మునుగోడు:పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐదని, సిపిఐ భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.గురువారం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ స్వాతంత్రం కోసం, రాజ్యాంగ పరిరక్షణ ,లౌకిక తత్వం, సమానత్వం కోసం అసమాన త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని గుర్తు చేశారు .1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఏర్పడిన సిపిఐ 100 వసంతాల సందర్భంగా డిసెంబర్ 30న నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు .తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి వేల ఎకరాల భూమి పంచిన చరిత్ర సిపిఐదని అన్నారు. నిరుపేదలకు ఇల్లు,రేషన్ కార్డులు,పింఛన్లు దక్కే వరకు సమరశీల పోరాటాలు సాగించాలని కోరారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురిజా రామచంద్రం బొలుగురి నరసింహ తీర్పారి వెంకటేశ్వర్లు సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాసు మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి బిలాలు మండల సహాయ కార్యదర్శులు బండమీది యాదయ్య మందుల పాండు ఈదులకంటి కైలాస దుబ్బ వెంకన్న వనం వెంకన్న ఉప్పునూతల రమేష్ కాగితం వెంకన్న కృష్ణయ్య జానీ ఉన్నారు.