వడపర్తి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోయి ఏర్పడిన మంచినీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా తుర్కపల్లి మీదుగా వడపర్తి వాగు చెరువును నింపి ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య లు డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో సిపిఎం జిల్లా మహాసభల జయప్రదం కోరుతూ ఇంటింటా సిపిఎం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో పలు సమస్యలను గుర్తించారు. దయ్యాల నరసింహ పల్లెర్ల అంజయ్య లు మాట్లాడుతూ గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తాగునీరు అందక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు మూడు నుండి 5రోజులకొకసారి మంచినీరు అందుతుందని దీంతో గ్రామంలోని ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారన్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం,పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెంటనే కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా వడపర్తి వాగు చెరువులోకి నీరును నింపడం వల్ల వడపర్తి గ్రామ ప్రజల సమస్యతో పాటు మండల పరిధిలోని 12 గ్రామాల ప్రజలకు త్రాగు, సాగు నీరు అందే అవకాశం ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ 15న చౌటుప్పల్ లో జరిగే భారీ బహిరంగ సభకు సిపిఎం పార్టీ శ్రేణులు,కార్మికులు,వ్యవసాయ కూలీలు వివిధ తరగతులకు చెందిన వృత్తిదారులు స్వచ్ఛందంగా పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య,నాయకులు ఎలిమినేటి రామ కృష్ణారెడ్డి,ఎస్ కె గోరేమియా, జూపెల్లి రవి,ఉడుత నర్సింహా, ముడుగుల రాంచందర్, నల్ల రాములు,బిచ్చాల సురేష్, మేడబోయిన వెంకటేష్, తుమ్మల నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు…