కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్న ఏమి సాధించారని సంబరాలు జరుపుతున్నారు… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి   

చౌటుప్పల్ లో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో మీడియా సమావేశంలో జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ రైతంగం విషయంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, గిట్టుబాటు ధర, బోనస్ విషయంలో రైతులు ఆందోళన గురవుతా ఉన్నారని అన్నారు. ఇంతవరకు ధరణి సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. మహిళలకు 2500, సిలిండర్ సబ్సిడీ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తే వాళ్లకు పట్టిన గతే వీళ్లకు పడుతుందని అన్నారు. కేంద్రంలోనున్న బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని అన్ని రంగాలను ధ్వంసం చేస్తుందని  ప్రజల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. 

 ఇలాంటి పరిస్థితులలో సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ జిల్లా మహాసభలు చౌటుప్పల్ ఉద్యమ కేంద్రంగా జరుగుతా ఉన్నాయని ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ, ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసుకొని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు.కమ్యూనిస్టుల పోరాటాల ద్వారానే  అసమనతో లేని సమాజం వస్తుందని అని అన్నారు. ఈ నెల డిసెంబర్ 15న చౌటుప్పల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని డిసెంబర్ 16 17 తేదీలలో ప్రతినిధుల సభ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, బండారు నరసింహ, సిపిఎం నాయకులు పల్లె మధు కృష్ణ, రాగిరి కిష్టయ్య, బొజ్జ బాలయ్య, ఆదిమూలం నందీశ్వర్,బోయ యాదయ్య పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment