సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్

పెద్దపల్లి ఐటీఐ కళాశాలలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు

పెద్దపల్లి, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలోఎక్కువగా మోసపోతున్న క్రిప్టో / బిట్ కాయిన్ మోసం, బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు దోచుకోవడం,మల్టీ లెవల్ మార్కెటింగ్ బిజినెస్,బిట్ కాయిన్స్ ట్రేడింగ్ నుండి వారిని అప్రమత్తం చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా క్రిప్టో / బిట్ కాయిన్స్ మోసం, మల్టీ లెవల్ మార్కెటింగ్ బాధితులు వుంటున్నారు.

దాంతో వారిని చైతన్యపరచాలని ఉద్దేశ్యం తో సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా డిజి షికా గోయల్, రామగుండం కమిషనర్ పోలీస్ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో పెద్దపెల్లిలోని ఐటిఐ కళాశాలలో క్రిక్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలపై అవగాహనా కల్పించాలని ఉద్దేశంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ J. కృష్ణమూర్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్టుకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి వారికి వివరించారు. అసలు డిజిటల్ అరెస్టు పోలీసు వారు చేయరు అని వివరించి, ఒకవేళ అలాంటి డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే వాటికి ఎలా స్పందించాలి? మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ లింక్ సిస్టం, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు వారికి వివరించడం జరిగింది. అంతే కాకుండా సైబర్ క్రైమ్ కు గురైనట్లయితే వెంటనే www.cybercrime.gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాల గురించి వారు తెలుసుకున్నది వివరించి వారిని కూడా అప్రమత్తం చేయాలని చెప్పారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని వారికి కి సూచించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ శంకర్, మరియు కానిస్టేబుల్స్ వెంకటేష్ కుమార్, ఐటిఐ కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment