ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2024 సంవత్సరంలో నగరవాసులు రూ. 1,866 కోట్ల రూపాయలను వివిధ సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారు అనే వార్త ఆందోళన కలిగిస్తుంది.
ఇందులో ప్రధానంగా జరుగుతున్న మోసాలు ఇవీ:
– స్టాక్ మార్కెట్లో, క్రిప్టో కరెన్సీలో అధిక లాభాల ఆశ చూపి డబ్బులు కొట్టెయ్యడం
– బ్యాంక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఓటీపీ పంపించి, దాన్ని దొంగిలించడం ద్వారా డబ్బు విత్‌డ్రా చేయడం
– డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం చేసి పైసలు గుంజడం
– మీరు పంపిన కొరియర్/పార్సెల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించి డబ్బులు వసూలు చెయ్యడం
– పార్ట్ టైం డీటీపీ జాబ్స్, యాడ్స్ క్లిక్ చేసే జాబ్స్ అంటూ మోసం చెయ్యడం
– గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేస్తే అది ఫేక్ కాల్ సెంటర్‌కు కనెక్ట్ అయ్యి మోసం జరగడం.
దయచేసి సైబర్ క్రైం గురించిన సమాచారాన్ని మీ ఇంట్లో పెద్దవాళ్లకు మరీ ముఖ్యంగా వాట్సాప్ వాడే అందరికీ చేరవెయ్యండి. మీ బంధువులు, మీ మిత్రులు, మీ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్, మీ పనివారు, డ్రైవర్లు, అందరికీ అవగాహన కలిపించండి. అనేక సైబర్ క్రైం నేరాలకు ఇవ్వాళ స్టార్టింగ్ పాయింట్ వాట్సాప్ లేదా టెలిగ్రాం యాప్‌లు కావడం గమనార్హం. ఒక్క రూపాయి కష్టార్జితం అయినా ఇలా అకారణంగా పోతే ఎంతో బాధ అవుతుంది. అలాంటిది చాలా మంది మధ్యతరగతి, పేద వారు ప్రతి రోజూ కోట్లల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు.
అవగాహన పెంచుకోండి.
అప్రమత్తంగా ఉండండి!