పంచాయతీ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ ను ఓడించండి–డాక్టర్ కే ఏ పాల్ ..

ప్రజాశాంతి పార్టీ తో గెలిచిన సర్పంచ్ లకు భారీగా నిధులు

— వంద రోజుల్లో గ్రామ అభివృద్ధి 

— ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో అభివృద్ధి శూన్యం

— ప్రజాశాంతి పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్త క్యాంపియన్లు 

— విలేకరుల సమావేశంలో డాక్టర్ కే ఏ పాల్ 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 19 (సమర శంఖమ్) :-

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలను ఓడించాలని, ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలిచిన సర్పంచ్ లకు భారీగా నిధులు కేటాయిస్తూ వంద రోజుల్లో ఆ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ అన్నారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధికి దూరంగా కొనసాగుతు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అవినీతి పాలన చేసిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి సాగనంపారని ఆరోపించారు. 

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా భద్రాచలం నుంచి ఖమ్మం దాకా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించలేదని, దోచుకోవటం దాచుకోవటమే వారికి పనిగా మారిందని దుయ్యబట్టారు.ప్రజలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిగులు బడ్జెట్ గా ఉన్నా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలిచే గ్రామ సర్పంచ్ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాశాంతి పార్టీ బలోపేతం కోసం క్యాంప్యాన్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి డబ్బును సేకరించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, తాగునీరు విద్యా ,వైద్యం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ప్రజాశాంతి పార్టీని ఆదరించి పెద్ద ఎత్తున చేరికలు చేపట్టాలని డాక్టర్ కె ఏ పాల్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment