ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ముదిగొండ నుంచి వల్లభ వరకు 5 కిలోమీటర్లు (ముదిగొండ పట్టణ పరిధిలో) ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులతో రహదారి విస్తరణతో పాటు డ్రైనేజ్, ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు గాను 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆ పనులకు ముదిగొండ మండల కేంద్రంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, cp సునీల్ దత్, కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.