ధనుర్మాసం సందర్భంగా ఆలయంలోని స్వామివారిని, అమ్మవార్లను, గోదాదేవి అమ్మవారిని, తొళకం వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ దక్షిణ గోపురంలో మీదుగా గ్రామోత్సవానికి బయలుదేరారు. గ్రామ పురవీధులలో గజ,అశ్వం, స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి టెంకాయలను సమర్పించి హారతులు అందుకున్నారు. అనంతరం విలాస మండపంలో కొలువుతీరిన స్వామివారి ధనుర్మాస ఉత్సవం చూపరులకు కనువిందు చేసింది. 19వ రోజు ధనుర్మాస విలాస మండపంలో స్వామివారి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
