జిల్లా ప్రజల ఆర్థిక అభివృద్ధికి రుణాలు అందివ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ బ్యాంకర్లకు చూసించారు.

---Advertisement---

గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రకాల రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకుల పనితీరు పై సమీక్షించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బిసి లబ్ధిదారులకు నిర్దేశిత లక్ష్యం మేరకు చేరేలా స్వయం ఉపాధి రుణాలను సకాలంలో అందించాలన్నారు. అలాగె కేంద్ర, రాష్టలకు సంభందించిన ప్రస్తుతం ఉన్న స్కింలతో పాటు నూతన స్కీమ్ ల స్వయం ఉపాధి రుణాలను ప్రాధాన్యతగా తీసుకుని అందించాలిన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర, వ్యాపార, ఎంఎస్ ఎంఇ ఋణాలను అందించాలని అన్నారు.స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ రుణాల లక్ష్యం 895.69 గాను 643 కోట్ల రుణాలను అందించామని మిగతా లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఆర్సెటి ఒక వరమని సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల ఆర్ సెటి లో 10 నుండి 60 రోజుల వ్యవదితో వివిధ రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చి రుణాలను కూడా అందించడం కూడా జరుగుతుంది కాబట్టి బ్యాంకర్లు మీ వద్దకు వచ్చే గ్రామీణ నిరుద్యోగులకు ఆర్ సెటి గురించి తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్డిఎం హరిబాబు, డిఆర్డిఓ జయదేవ్ ఆర్యా, జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, జిల్లా పరిశ్రమల అధికారి గణేష్, నాబార్డ్ ఏజిఎం నిఖిల్, ఆర్ సెటి డైరెక్టర్ రాజలింగం, వివిధ బ్యాంక్ ల ఆర్ఎంలు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment