రహదారుల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నెక్కొండ మండలంలోని రహదారుల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ లో హైబ్రిడ్ వార్షిక నిర్వహణ కింద రోడ్ల భవనాల శాఖ ద్వారా మరమ్మతులు, బలోపేతం అప్ గ్రేడేషన్, రీసర్ఫేసింగ్ చేస్తున్న రహదారులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్లపై గుంతలు నింపడం, మరమ్మతులు, నవీకరణ, అత్యవసర పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వరదల సమయంలో దెబ్బతిన్న నర్సంపేట నెక్కొండ రోడ్డు ను, నెక్కొండ గూడూరు రోడ్డు,
కేసముద్రం నెక్కొండ రోడ్, లను పరిశీలించి రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నారు. వెంకటాపూర్ గ్రామం సమీపంలో వరదల వల్ల రాకపోకలకు అంతరాయం కలిగిన రెండు లో లెవెల్ కాజ్వే లను, రోడ్డు ఆనకట్ట పై వేసిన పైపులైను పరిశీలించి వెంటనే బిటి సర్ఫేసింగ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా హనుమకొండ నర్సంపేట మహబూబాబాద్ నర్సంపేట రోడ్డును, పాకాల రోడ్డును కూడా మరమ్మత్తులకు ప్రతిపాదించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా రోడ్ల భవనాల శాఖ డీఈ రమాదేవి, ఏఈ గోపి తదితరులు పాల్గొన్నారు.